తొడకొట్టి కొడాలి నానికి సవాల్

ABN , First Publish Date - 2022-09-25T00:08:19+05:30 IST

నిర్బంధాలు, ఆంక్షల మధ్య అమరావతి (Amaravathi) మహా పాదయాత్ర గుడివాడ (Gudivada)లో అడుగుపెట్టింది.

తొడకొట్టి కొడాలి నానికి సవాల్

గుడివాడ: నిర్బంధాలు, ఆంక్షల మధ్య అమరావతి (Amaravathi) మహా పాదయాత్ర గుడివాడ (Gudivada)లో అడుగుపెట్టింది. పోలీసులు ఆంక్షలను తెంచుకుని గుడివాడలోకి అమరావతి రైతులు ప్రవేశించారు. గుడివాడలోని పాదయాత్ర రాగనే వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. ఎమ్మెల్యే కొడాలి నాని (kodali nani) కార్యాలయం వద్ద ఆకాశమే హద్దుగా అమరావతి రైతుల నినాదాలు చేశారు. తొడకొడుతు కొడాలి నానికు రైతులు సవాల్ విసిరారు. దాంతో గుడివాడ వైసీపీ (ycp) కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను అదుపు చేయలేక పోలీసులు రోడ్లకు అడ్డంగా భారీకేడ్లు పెట్టారు. రాజధాని రైతుల రథాన్ని తీసివేయాలని పోలీసుల ఆదేశించారు. ఒక్క పాట పాడి వెళ్లిపోతామని కళాకారులు చెప్పగా... కళాకారులపై పోలీసుల దురుసుగా ప్రవర్తించారు. కళాకారులను పోలీసులు నెట్టివేశారు. పోలీసుల తీరుపై కళాకారుల నిరసన వ్యక్తం చేశారు. రైతుల రథం దిగి రోడ్డుపై కళాకారులు పాటలు పాడారు. అడుగడుగునా ఆంక్షలపై జేఏసీ నేతల అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు, రైతు మద్దతుదారుల మధ్య వాగ్వాదం జరిగింది. 


గుడివాడ వ్యవసాయ మార్కెట్ దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రథం, రైతులు, మహిళలకు‌ వేర్వేరుగా రోప్ పార్టీలతో పోలీసు బలగాలను మోహరించారు. రైతుల పాదయాత్రపై దాడి జరిగే అవకాశం ఉందని ఇప్పటికే పోలీసులకు జేఏసీ నాయకులు వివరించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గుడివాడకు భారీగా పోలీసులను రప్పించారు. మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్నవారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వస్తున్నవారిని ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసుల తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 600 మంది రైతులతో పాదయాత్రకు హైకోర్టు (High Court) అనుమతించిందని ఎస్పీ జాషువా (SP Joshua) తెలిపారు. హైకోర్టు ఆదేశాలను అందరూ పాటించాలని, గుడివాడలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జాషువా హెచ్చరించారు.


మరోవైపు రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన వారికి పోలీసులు బ్రేకులు వేసే పనిలో పడ్డారు. రైతుల పాదయాత్రకు వెళ్లే వారికి నోటీసులు అందజేస్తున్నారు. గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కంకిపాడు టోల్‌గేట్‌ దగ్గర మచిలీపట్నం మాజీ జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో గద్దె అనురాధ వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ పోలీసులు అనుమతించలేదు. పాదయాత్రకు వస్తున్న స్పందనతో ప్రభుత్వం కావాలనే యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని అమరావతి పరిరక్షణ సమితి ఆరోపించారు.

Read more