వరద బాధితులకు చేయూత ఏది: Sailajanath

ABN , First Publish Date - 2022-07-18T00:58:25+05:30 IST

వరద బాధితులకు చేయూత ఏదని ఏపీసీసీ అధ్యక్షుడు (Ap Pcc Chief) సాకే శైలజానాథ్ (Sake Sailajanath) అన్నారు..

వరద బాధితులకు చేయూత ఏది: Sailajanath

అమరావతి (Amaravathi): వరద బాధితులకు చేయూత ఏదని ఏపీసీసీ అధ్యక్షుడు (Ap Pcc Chief) సాకే శైలజానాథ్ (Sake Sailajanath) అన్నారు.  (Lanka Villages) లంక గ్రామాల్లో ఇంత నష్టం జరిగే అవకాశం ఉందని తెలిసినా ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చోద్యం చూస్తోందని ఆయన మండిపడ్డారు. చుట్టపు చూపుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  (Cm jagan) ఏరియల్ సర్వే చేసి తాడేపల్లి ప్యాలస్ (Tadepalli Palace)‎లో కూర్చుంటే బాధితుల ఆర్తనాదాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. లంక గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాన్ని అంచనా వేసి సాయం అందించాలని సాకే శైలజానాథ్ సూచించారు. 

Updated Date - 2022-07-18T00:58:25+05:30 IST