అమలాపురంలో అగ్నిప్రమాదం... తల్లీకూతుళ్ల సజీవదహనం

ABN , First Publish Date - 2022-07-02T14:37:06+05:30 IST

జిల్లాలోని అల్లవరం మండల కొమ్మరగిరిపట్నం ఆకులవారి వీధిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు సజీవదహనం అయ్యారు.

అమలాపురంలో అగ్నిప్రమాదం... తల్లీకూతుళ్ల సజీవదహనం

అమలాపురం: జిల్లాలోని అల్లవరం మండల కొమ్మరగిరిపట్నం ఆకులవారి వీధిలో  అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో తల్లీకూతుళ్లు సజీవదహనం అయ్యారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు సాధనాల మంగాదేవి(40), మెడిశెట్టి జ్యోతి (23)గా గుర్తించారు. మృతుల్లో కూతురు గర్భవతి అని తెలుస్తోంది. ఐదు నెలల క్రిమతమే జ్యోతి ప్రేమ వివాహం చేసుకుంది. కాగా ప్రమాదంపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-07-02T14:37:06+05:30 IST