ఆ నాలుగూ పాతవే.. నీరు విడుదల చేయొచ్చు
ABN , First Publish Date - 2022-08-04T09:13:36+05:30 IST
ఆ నాలుగూ పాతవే.. నీరు విడుదల చేయొచ్చు
తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండపై గెజిట్ జారీ
అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా.. హంద్రీ-నీవా, తెలుగుగంగ, గాలేరు-నగరి, వెలిగొండ ప్రాజెక్టులు పాతవేనని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. వీటికి నీరు విడుదల చేయొచ్చంటూ గత నెల 28వ తేదీన గెజిట్ విడుదల చేసింది. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఈ ఆరు సహా పలు ప్రాజెక్టులపై ఉభయ రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కూడా ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని వాటిని కోరింది. ఈ డీపీఆర్‌లను కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన గల అపెక్స్ కౌన్సిల్‌లో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. అయితే ఈ ఆరు ప్రాజెక్టులూ పాతవేనని కేంద్రం తేల్చిచెబుతూ.. వాటికి నీటి విడుదల చేయాలని ఆదేశిస్తూ గెజిట్‌ను విడుదల చేయడంతో.. ఇక జల వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు.