మల్లన్న భక్తులకు సకల సౌకర్యాలు

ABN , First Publish Date - 2022-05-01T03:25:09+05:30 IST

శ్రీశైలం మల్లన్న భక్తులకు సకల సౌకర్యాల ఏర్పాట్లపై ఈఓ లవన్న సమీక్ష సమావేశం నిర్వహించారు.

మల్లన్న భక్తులకు సకల సౌకర్యాలు

నంద్యాల: శ్రీశైలం మల్లన్న భక్తులకు సకల సౌకర్యాల ఏర్పాట్లపై ఈఓ లవన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యూలైన్లలో ఎండ వేడిమికి భక్తులు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు మంచినీరు అల్పాహారం యధావిధిగా కొనసాగించాలన్నారు. క్యూలైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు చేయడానికి ఈ సమావేశంలో నిర్ణయించామన్నారు. పర్వదినాలు సెలవురోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటున్నందున డార్మెంటరిలలో అదనపు స్నానపు గదులు ఏర్పాటు చేయాలని ఈఓ లవన్న సూచనలిచ్చారు.

Updated Date - 2022-05-01T03:25:09+05:30 IST