అకటా! మూడేళ్లలో ఐదు ఇళ్లా!: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2022-12-15T03:34:49+05:30 IST
జగన్ ప్రభుత్వం గత మూడేళ్లలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేవలం ఐదు ఇళ్లు మాత్రమే పూర్తిచేయడం అత్యంత దురదృష్టకరం అని కాంగ్రెస్ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు.
వేంపల్లె, డిసెంబరు 14: జగన్ ప్రభుత్వం గత మూడేళ్లలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేవలం ఐదు ఇళ్లు మాత్రమే పూర్తిచేయడం అత్యంత దురదృష్టకరం అని కాంగ్రెస్ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. ‘‘గత మూడు సంవత్సరాల కాలంలో పీఎంఏవై కింద దేశవ్యాప్తంగా 97,67,825 ఇళ్లు పూర్తయితే... ఏపీలో కేవలం ఐదు ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని కేంద్ర మంత్రి చెప్పడం గమనార్హం. వైసీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పింది. వైసీపీ ప్రభుత్వ అసమర్థతకు ఇది మచ్చుతునక. వెంటనే ముఖ్యమంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రాజీనామా చేయాలి’’ అని ఆయన డిమాడ్ చేశారు.