జగనుకు ఓటేసి ప్రజలు తప్పు చేశారు: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2022-01-05T18:15:55+05:30 IST
వైఎస్ జగనుకు ఓటేసి ప్రజలు తప్పు చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

అమరావతి: వైఎస్ జగనుకు ఓటేసి ప్రజలు తప్పు చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ చరిత్ర తెలిసి మరీ ప్రజలు ఓటేశారన్నారు. టీడీపీని లేకుండా చేసేందుకు వైసీపీ చాలా ప్రయత్నాలే చేసిందన్నారు. వైసీపీ తరహాలో టీడీపీ గాలికి పుట్టి.. గాలికి పెరగలేదన్నారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేయడానికి వైసీపీ నేతలకు సిగ్గు లేదా..? అని ప్రశ్నించారు. రూ.3,300 కోట్ల అంచనాతో సీమెన్స్ ప్రాజెక్టు రాష్ట్రానికి తెచ్చామని, 90 శాతం ఖర్చు సీమెన్స్ కంపెనీదేనని ఆయన తెలిపారు. 10 శాతం మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసేలా ఒప్పందం జరిగిందని అచ్చెన్నాయుడు తెలిపారు.