చంద్రబాబు టెక్నాలజీనే.. పెగాసిస్: అబ్బయ్య చౌదరి

ABN , First Publish Date - 2022-03-19T21:37:23+05:30 IST

చంద్రబాబు చెప్పుకునే టెక్నాలజీనే.. పెగాసిస్.. పెగాసిస్ సాఫ్ట్‌‌వేర్‌ను 2017లో భారత దేశంలో కొన్నారని బయట పడిందని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు.

చంద్రబాబు టెక్నాలజీనే.. పెగాసిస్: అబ్బయ్య చౌదరి

ఏలూరు: చంద్రబాబు చెప్పుకునే టెక్నాలజీనే.. పెగాసిస్.. పెగాసిస్ సాఫ్ట్‌‌వేర్‌ను 2017లో భారత దేశంలో  కొన్నారని బయట పడిందని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి  అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ మా ఫోన్స్ హ్యాక్ అవుతున్నాయని వైసీపీ పార్టీ నేతలు చెప్తున్నా పట్టించుకోలేదు. ఎప్పుడు అధికారంలో ఉండాలనే అధికార దాహంతో మా పార్టీలో ఉన్న ప్రధాన నాయకులు మాట్లాడే విషయాలు తెలుసుకోవాలని చంద్రబాబు పెగాసిస్ వాడారు. దేశంలో చంద్రబాబు మమతా బెనర్జీ దిగిన ఫొటోస్ అప్పుడు చాలా చర్చనీయాంశంగా మారాయి. ఇంకా చంద్రబాబు ఈ పెగాసిస్ సాఫ్ట్‌‌వేర్‌ను వాడుతున్నారనే అనుమానాలు ఉన్నాయి’’ అని అబ్బయ్య చౌదరి  అన్నారు. 

Updated Date - 2022-03-19T21:37:23+05:30 IST