ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-15T08:23:44+05:30 IST

ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తన విద్యార్హతకు తగిన ఉద్యోగం దొరకలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌, కడప జిల్లా సంతకొవ్వూరు పరిధి గంగనపల్లి గ్రామానికి చెందిన కంచర్ల గంగమహేశ్వర్‌ రెడ్డి (29) బీటెక్‌ పూర్తి చేశాడు. కొంతకాలం ఓ ప్రైవేటు ఉద్యోగం చేసి మానేశాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ఇటీవలే నగరానికి వచ్చాడు. కానీ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో సికింద్రాబాద్‌ సమీపంలోని ఆర్‌ఆర్‌ఐ క్యాబిన్‌ వద్ద రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

Read more