బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-08-04T09:11:02+05:30 IST

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

జంతర్‌ మంతర్‌ వద్ద బీసీ సంఘం ధర్నా 

న్యూఢిల్లీ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఏటా బీసీ కులాల అభివృద్థికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయించాలని, త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో కుల గణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ధర్నాకు టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌ నాయుడు, గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌, వైసీపీ ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, మార్గాని భరత్‌, సత్యవతి, గురుమూర్తి, మాధవ్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ హాజరై సంఘీభావం తెలిపారు. 


Updated Date - 2022-08-04T09:11:02+05:30 IST