ఉద్యాన వర్సిటీకి కొత్త పాలకవర్గం
ABN , First Publish Date - 2022-12-16T01:31:45+05:30 IST
డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి కొత్త పాలకవర్గ సభ్యులను ప్రభుత్వం నియమించింది.
అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి కొత్త పాలకవర్గ సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం గెజిట్ జారీ అయింది. ఎంపీ, ఎమ్మెల్యేల కోటాలో శింగనమల, పాడేరు, చింతలపూడి ఎమ్మెల్యేలు జే పద్మావతి, కే భాగ్యలక్ష్మి, వీ ఎలిజా, అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతిలను నియమించారు. అభ్యుదయ రైతుల కోటాలో జెన్నూరి వెంకటేశ్వరరావు(కోనసీమ), బత్తిన లక్ష్మీనారాయణ(శ్రీకాకుళం), దువ్వూరి చంద్రశేఖర్రెడ్డి(నెల్లూరు), శివప్రసాదరెడ్డి(కడప), వ్యవసాయ పారిశ్రామికవేత్త కేశవ్రెడ్డి, పారిశ్రామికవేత్త సుమిత్రారాజేశ్, విశిష్ట వ్యవసాయ శాస్త్రవేత్త కోటాలో విశ్రాంత ఉద్యాన శాస్త్రవేత్త వైఎన్రెడ్డి(హైదరాబాద్) తదితరులను నియమించారు.