మంటల్లో గ్యాస్‌ సిలిండర్ల లారీ

ABN , First Publish Date - 2022-09-03T09:59:05+05:30 IST

మంటల్లో గ్యాస్‌ సిలిండర్ల లారీ

మంటల్లో  గ్యాస్‌ సిలిండర్ల లారీ

పెద్ద పెద్ద శబ్దాలతో ఎగిరిపడిన సిలిండర్లు

కొమరోలు, సెప్టెంబరు 2: శుక్రవారం అర్ధరాత్రి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామం. రోడ్డుపై నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తుండటంతో స్థానికులంతా భీతావహులయ్యారు. వెళ్లి చూస్తే.. 306 గ్యాస్‌ సిలిండర్లతో ఉన్న లారీ అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది. దానిలోని సిలిండర్ల పెద్ద పెద్ద శబ్దాలతో పేలిపోతూ.. ఎగిరిపడుతున్నాయి. ఈ లారీ కర్నూలు నుంచి నెల్లూరు జిల్లా ఉలవపాడు వెళ్తోంది. దద్దవాడ గ్రామ సమీపానికి వచ్చేసరికి లారీ ఇంజన్‌ వద్ద మంటలు వచ్చాయి. డ్రైవర్‌  మోహన్‌రాజు ప్రమాదాన్ని గుర్తించి లారీని ఆపి, కిందకు దూకేసి దూరంగా వెళ్లిపోయాడు. పోలీసులకు సమాచారం ఇచ్చి, వాహనాలు రాకుండా ట్రాఫిక్‌ను నియంత్రించాడు.  పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఐదు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అప్పటికే 100 సిలిండర్లు పేలిపోయాయి. లారీ పూర్తిగా కాలిపోయింది.


Updated Date - 2022-09-03T09:59:05+05:30 IST