కందుకూరు మృతులకు 8 లక్షలు: భాష్యం ప్రవీణ్
ABN , First Publish Date - 2022-12-31T05:29:56+05:30 IST
కందుకూరు మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి టీడీపీ నేతలు ముందుకు వస్తున్నారు.

గుంటూరు(ఆంధ్రజ్యోతి), నిడదవోలు, డిసెంబరు 30: కందుకూరు మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి టీడీపీ నేతలు ముందుకు వస్తున్నారు. శుక్రవారం టీడీపీ నేత భాష్యం ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘భాష్యం చారిటబుల్ ట్రస్టు ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేస్తా. మొత్తం ఎనిమిది కుటుంబాలకు ఒక్కో రూ.లక్ష చొప్పున రూ.8 లక్షల సాయాన్ని అందిస్తా’’ అని ప్రకటించారు. కాగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాలకు చెందిన టీడీపీ నేత కుందుల వీర వెంకట సత్యనారాయణ ఒక్కో బాధిత కుటుంబానికి రూ.50 వేలు చొప్పున అందిస్తున్నట్లు ప్రకటించారు.
Read more