635 కింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2022-12-07T02:33:08+05:30 IST

ప్రకాశం జిల్లా మద్దిపా డు మండలం గుళ్లాపల్లి పరిశ్రమల కేంద్రంలోని విజయలక్ష్మి బాయిల్డ్‌ రైస్‌మిల్లుపై మంగళవారం విజిలెన్సు అధికారులు దాడులు నిర్వహించారు.

635 కింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

మద్దిపాడు, డిసెంబరు 6: ప్రకాశం జిల్లా మద్దిపా డు మండలం గుళ్లాపల్లి పరిశ్రమల కేంద్రంలోని విజయలక్ష్మి బాయిల్డ్‌ రైస్‌మిల్లుపై మంగళవారం విజిలెన్సు అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడ 1668 బస్తాల్లో నిల్వ ఉంచిన 635 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. వెల్లంపల్లికి చెందిన నాగరాజు, సునీల్‌, భూపతి గోపి, ఒంగోలుకు చెందిన మెట్ట రాజారావు ఉమ్మడిగా బియ్యం వ్యాపారం చేస్తున్నారు. దొడ్డవరానికి చెందిన బెజవాడ పూర్ణచంద్రరావు వద్ద వీరు మిల్లును లీజుకు తీసుకున్నారు. రేషన్‌ డీలలర్ల వద్ద కొనుగోలు చేసిన బియ్యాన్ని రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచా రు. వీటిని పాలిష్‌ చేసి 10కిలోలు, 25కిలోల బ్యాగుల్లో ఉంచి విక్రయిస్తున్నారు. ఈ విషయమై సమాచారం అందుకున్న విజిలెన్సు అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు ఏఎస్పీ భవాని, డీఎస్పీ అశోక్‌వర్థన్‌, సీఐ సుబ్బారావు నేతృత్వంలో రైస్‌మిల్లుపై మంగళవారం దాడి చేసి అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2022-12-07T02:33:11+05:30 IST