శ్రీశైలానికి 51,018 క్యూసెక్కుల వరద
ABN , First Publish Date - 2022-10-07T08:11:48+05:30 IST
శ్రీశైలానికి 51,018 క్యూసెక్కుల వరద
శ్రీశైలం, అక్టోబరు 6: శ్రీశైల జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. గురువారం జూరాల నుంచి 29,983, సుంకేశుల నుంచి 21,035, హంద్రీ నుంచి 117 మొత్తం 51,018 క్యూసెక్కులు శ్రీశైలంలోకి వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.70 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 213.8824 టీఎంసీల నీరు ఉంది. ఏపీ, తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.