'Kundabaddalu' Subbarao: ‘కుండబద్దలు’ సుబ్బారావుకు 41ఏ నోటీసులు

ABN , First Publish Date - 2022-11-08T04:19:10+05:30 IST

కుండబద్దలు యూట్యూబ్‌ చానల్‌ అధినేత, ప్రముఖ విశ్లేషకుడు కాటా సుబ్బారావుకు పోలీసులు 41ఏ నోటీసు అందించారు. మూడు రాజధానుల విషయంలో కుట్ర పూరితంగా సీఎం జగన్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని రాయదుర్గానికి చెందిన కె.రామాంజనేయులు అనే వ్యక్తి 2020లో చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా గుమ్మగట్ట పోలీసులు కేసు నమోదు చేశా రు.

'Kundabaddalu' Subbarao: ‘కుండబద్దలు’ సుబ్బారావుకు 41ఏ నోటీసులు

జగన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు

సుబ్బారావుపై కేసు అప్రజాస్వామికం: టీడీపీ

నాదెండ్ల, నవంబరు 7: కుండబద్దలు యూట్యూబ్‌ చానల్‌ అధినేత, ప్రముఖ విశ్లేషకుడు కాటా సుబ్బారావుకు పోలీసులు 41ఏ నోటీసు అందించారు. మూడు రాజధానుల విషయంలో కుట్ర పూరితంగా సీఎం జగన్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని రాయదుర్గానికి చెందిన కె.రామాంజనేయులు అనే వ్యక్తి 2020లో చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా గుమ్మగట్ట పోలీసులు కేసు నమోదు చేశా రు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామం లో నివసిస్తున్న సుబ్బారావుకు సోమవారం రాత్రి కానిస్టేబుల్‌ పవన్‌ ద్వారా నోటీసును అందజేశారు. తాను ఎవ్వరినీ దుర్భాషలాడలేదని, ఏ సమస్యనైనా చట్టపరంగా ఎదుర్కొంటానని సుబ్బారావు విలేకరులకు తెలిపా రు. 70 ఏళ్ల వయసులో వారాని కి మూడు సార్లు డయాలసిస్‌ చేయించుకుంటున్నానన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు, లీగల్‌ సెల్‌ న్యాయవాది రాజీవ్‌ ఆనంద్‌ లు సుబ్బారావు నివాసానికి వచ్చి మద్దతు ప్రకటించారు. సుబ్బారావుపై కేసు నమోదు అప్రజాస్వామికమన్నారు. చార్జ్‌ షీటు ఫైల్‌ చేస్తే చిలకలూరిపేట కోర్టుకు కేసు బదిలీ చేసే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. గతంలో సుబ్బారావు డయాలసిస్‌ కోసం గుంటూరు వెళ్తుండగా వాహనంతో గుద్దించి హత్యాయత్నం చేశారు.

Updated Date - 2022-11-08T04:19:11+05:30 IST