జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2022-02-23T15:30:53+05:30 IST

రాప్తాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

అనంతపురం : రాప్తాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఎఫ్‌సీఐ గోడౌన్ సమీపంలో బొలెరో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. అనంతపురం పట్టణానికి చెందిన ద్వారకేష్, మల్లికార్జున అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రబాబు నగర్‌కు చెందిన కుమార్ అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.


Read more