ఏపీలో కొత్తగా 11,573 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-29T23:06:31+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 11,573 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కొత్తగా 11,573 కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 11,573 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 22,60,181కి కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో  ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల 14,594 మంది మృతి చెందారు. ఏపీలో 1,15,425 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 21,30,162 మంది రికవరీ అయ్యారు. 


మరోవైపు కరోనా విజృంభిస్తున్న వేళ జిల్లాలో కరోనా పరీక్షలు, వైద్యం ప్రైవేటుగా విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలు తక్షణం రాని పరిస్థితుల్లో వాటి కోసం రెండో రోజు వరకూ వేచి ఉండలేని వారు మాత్రం ర్యాపిడ్‌ టెస్టులకే మొగ్గు చూపుతున్నారు. ర్యాపిడ్‌ టెస్టుల్లో పాజిటివ్‌ వచ్చిన వారు కొందరు సాంకేతికంగా నిర్ధారణ జరిగే ఆర్‌టీసీపీఆర్‌ పరీక్షలకు వెళుతున్నా మెజారిటీ సంఖ్యలో మాత్రం ప్రైవేటు వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారు.

Updated Date - 2022-01-29T23:06:31+05:30 IST