AP News: గర్భిణీని తీసుకెళ్తుండగా రోడ్డు మధ్యలో ఆగిపోయిన 108 అంబులెన్స్

ABN , First Publish Date - 2022-09-26T17:15:38+05:30 IST

జిల్లాలోని గోరంట్ల మండలం వడిగేపల్లి సమీపంలో 108 అంబులెన్సు రోడ్డు మధ్యలో ఆగిపోయింది.

AP News: గర్భిణీని తీసుకెళ్తుండగా రోడ్డు మధ్యలో ఆగిపోయిన 108 అంబులెన్స్

శ్రీ సత్యసాయి: జిల్లాలోని గోరంట్ల మండలం వడిగేపల్లి సమీపంలో 108 అంబులెన్సు రోడ్డు మధ్యలో ఆగిపోయింది. వడిగేపల్లి నుంచి గర్భిణీ 108లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రోడ్డు సరిగ్గా లేకపోవడంతో అంబులెన్స్ నిలిచిపోయింది. అంబులెన్స్‌లో గర్భిణీ పురిటినొప్పులతో బాధపడుతోంది. రోడ్డు పరిస్థితిపై పలుసార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గర్భిణీ ఆవేదన చెందింది. వడ్డేపల్లి నుంచి గోరంట్ల కు వెళ్లాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read more