కొత్తగా రాష్ట్ర కేడర్‌కు10 మంది ఐఏఎస్‌లు

ABN , First Publish Date - 2022-12-16T01:30:54+05:30 IST

ఏపీ కేడర్‌కు కొత్తగా 10 మంది ఐఏఎస్‌ అధికారులను కేంద్రం కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది-శిక్షణ విభాగం (డీవోపీటీ) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.

కొత్తగా రాష్ట్ర కేడర్‌కు10 మంది ఐఏఎస్‌లు

ఆరుగురు తెలుగువారే

అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఏపీ కేడర్‌కు కొత్తగా 10 మంది ఐఏఎస్‌ అధికారులను కేంద్రం కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది-శిక్షణ విభాగం (డీవోపీటీ) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. 2021 సివిల్‌ సర్వీసెస్‌ బ్యాచ్‌కు చెందిన మొత్తం 180 మందిని దేశవ్యాప్తంగా కేటాయించగా.. ఆంధ్రప్రదేశ్‌కు వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మందిని కేటాయించారు. వీరిలో ఆరుగురు తెలుగువారే కావడం గమనార్హం. సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, మంత్రి మౌర్య భరద్వాజ, తిరుమణి శ్రీపూజ (ఏపీ), వి.సంజనాసింహ, బి.సహాదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌, బచ్చు స్మరణ్‌రాజ్‌ (తెలంగాణ), కుశల్‌ జైన్‌ (మధ్యప్రదేశ్‌), శౌర్యమాన్‌ పటేల్‌ (యూపీ), కల్పశ్రీ కేఆర్‌ (కర్ణాటక), రాఘవేంద్ర మీనా (రాజస్థాన్‌)లను ఏపీకి కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు.

Updated Date - 2022-12-16T01:30:55+05:30 IST