మేథీ బాజీ

ABN , First Publish Date - 2021-10-29T18:16:48+05:30 IST

కత్తిరించిన మెంతి కూర - మూడు కప్పులు, కొబ్బరి తురుము- అర కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, పసుపు- అర స్పూను, పచ్చి మిర్చి- రెండు, అల్లం ముక్కలు- స్పూను, నూనె, ఉప్పు- తగినంత.

మేథీ బాజీ

కావలసిన పదార్థాలు: కత్తిరించిన మెంతి కూర - మూడు కప్పులు, కొబ్బరి తురుము- అర కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, పసుపు- అర స్పూను, పచ్చి మిర్చి- రెండు, అల్లం ముక్కలు- స్పూను, నూనె, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: ఓ బాణలిలో రెండు స్పూన్ల నూనె వేసి కాగాక, మిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ తరవాత ఉల్లి ముక్కలూ వేసి బంగారు రంగులోకి మారాక పసుపు, మెంతికూర, ఉప్పు వేసి కలిపి పది నిమిషాలు కొద్ది మంటమీద ఉడికించాలి. కొబ్బరి తురుము వేసి రెండు నిమిషాలు మగ్గించి దించేస్తే మేథీ బాజీ రెడీ. ఈ కూర చపాతీ, అన్నంలోకి బాగుంటుంది.

Updated Date - 2021-10-29T18:16:48+05:30 IST