గుజరాతీ దాల్‌

ABN , First Publish Date - 2021-05-20T20:13:47+05:30 IST

కందిపుప్ప- కప్పు, నీళ్లు- రెండున్నర కప్పులు, టమోటా- ఒకటి (ముక్కలుగా కట్‌ చేసినది), పచ్చి మిర్చి- రెండు, అల్లం ముద్ద- అర స్పూను, కొత్తిమీర తురుము- సగం కప్పు, పసుపు, కారప్పొడి-

గుజరాతీ దాల్‌

కావలసిన పదార్థాలు: కందిపుప్ప- కప్పు, నీళ్లు- రెండున్నర కప్పులు, టమోటా- ఒకటి (ముక్కలుగా కట్‌ చేసినది), పచ్చి మిర్చి- రెండు, అల్లం ముద్ద- అర స్పూను, కొత్తిమీర తురుము- సగం కప్పు, పసుపు, కారప్పొడి- అర స్పూను, నూనె- తగినంత, తాళింపు గింజలు- రెండు స్పూన్లు, కరివేపాకు- రెండు రెబ్బలు, ఇంగువ, బెల్లం- కాస్త, లవంగాలు- నాలుగు.


తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పును పాన్‌లో ఉడికించాలి. గరిటతో మెత్తగా చేసుకోవాలి. పచ్చిమర్చి, అల్లం ముద్ద, లవంగాలు, పసుపు, కారప్పొడి, ఉప్పు, బెల్లం, టమోటా ముక్కలు వేసి బాగా కలిపి స్టవ్‌ మీద మరో ఎనిమిది నిమిషాల పాటు ఉడికించాలి. పప్పంతా చిక్కగా అవుతుంది. దీనికి పోపు పెట్టి, పైన కొత్తిమీర తురుము వేస్తే గుజరాతీ దాల్‌ రెడీ. పరాఠా, చపాతీతో పాటు అన్నంలోకీ ఈ దాల్‌ బాగుంటుంది.


Updated Date - 2021-05-20T20:13:47+05:30 IST