క్రిస్పీ కార్న్‌

ABN , First Publish Date - 2021-10-29T17:52:07+05:30 IST

స్వీట్‌ కార్న్‌- రెండు కప్పులు, ఉల్లి, క్యాప్సికమ్‌ ముక్కలు- అర కప్పు, కార్న్‌ ఫ్లోర్‌, వరి పిండి- చెరో పావు స్పూను,

క్రిస్పీ కార్న్‌

కావలసిన పదార్థాలు: స్వీట్‌ కార్న్‌- రెండు కప్పులు, ఉల్లి, క్యాప్సికమ్‌ ముక్కలు- అర కప్పు, కార్న్‌ ఫ్లోర్‌, వరి పిండి- చెరో పావు స్పూను, మైదా- స్పూను, మిరియాల పొడి- పావు స్పూను, కారం- అర స్పూను, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు- తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా స్వీట్‌ కార్న్‌ని ఉడికించి పెట్టుకోవాలి. ఓ గిన్నెలో కార్న్‌ ఫ్లోర్‌, వరి పిండి, మైదా, ఉప్పు, ఉడికించిన స్వీట్‌ కార్న్‌ను వేసి తగినంత నీటితో ఓ మోస్తరుగా కలుపుకోవాలి. ఓ బాణలిలో నూనె మరిగించి బజ్జీల్లా వేయించాలి. వేయించిన కార్న్‌ను ఓ వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని దాని పైన కారం, మిరియాల పొడి, కొంచెం ఉప్పు, ఉల్లి, క్యాప్సికమ్‌ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి పైకీ కిందకీ కలిపితే క్రిస్పీ కార్న్‌ రెడీ.

Updated Date - 2021-10-29T17:52:07+05:30 IST