రైస్‌ పొటాటో కట్‌లెట్స్‌

ABN , First Publish Date - 2021-07-24T17:43:55+05:30 IST

బియ్యప్పిండి - అరకప్పు, బంగాళదుంపలు - నాలుగు, జీలకర్ర, అర టీస్పూన్‌, పసుపు - చిటికెడు, కారం - అర టీస్పూన్‌, నూనె - సరిపడా, మిరపగింజలు - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - పావుటీస్పూన్‌, ఛాట్‌ మసాల - ఒక టీస్పూన్‌, అల్లం పేస్టు - అర టీస్పూన్‌

రైస్‌ పొటాటో కట్‌లెట్స్‌

కావలసినవి: బియ్యప్పిండి - అరకప్పు, బంగాళదుంపలు - నాలుగు, జీలకర్ర, అర టీస్పూన్‌, పసుపు - చిటికెడు, కారం - అర టీస్పూన్‌, నూనె - సరిపడా, మిరపగింజలు - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - పావుటీస్పూన్‌, ఛాట్‌ మసాల - ఒక టీస్పూన్‌, అల్లం పేస్టు - అర టీస్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం: ముందుగా బంగాళదుంపలను ఉడికించి గుజ్జుగా చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగించాలి. తరువాత పసుపు, కారం వేసి ఒక కప్పు నీళ్లు పోయాలి. తగినంత ఉప్పు వేయాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో బియ్యప్పిండి వేయాలి. మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికిన తరువాత స్టవ్‌పై నుంచి దింపి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో ఉడికించిన బంగాళదుంపలు తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బియ్యప్పిండి మిశ్రమంలో వేయాలి. తరువాత మిరియాలపొడి, మిరపగింజలు, ఛాట్‌మసాల, అల్లం పేస్టు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్నచిన్న బాల్స్‌లా చేసుకుంటూ కట్‌లెట్స్‌గా ఒత్తుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక  రైస్‌ పొటాటో కట్‌లెట్స్‌ వేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి. గ్రీన్‌ చట్నీతో వేడివేడిగా తింటే రైస్‌ పొటాటో కట్‌లెట్స్‌ రుచిగా ఉంటాయి.


Read more