నీటి ఆవకాయ పచ్చడి

ABN , First Publish Date - 2021-06-12T22:10:26+05:30 IST

కాలానికి అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వర్షాకాలం ప్రారంభం అవుతోంది కాబట్టి రోగనిరోధకశక్తిని పెంచే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలా అని కొత్త కొత్త వంటలు

నీటి ఆవకాయ పచ్చడి

వానాకాలంలో పాత రుచులు ఘనంగా..!

కాలానికి అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వర్షాకాలం ప్రారంభం అవుతోంది కాబట్టి రోగనిరోధకశక్తిని పెంచే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలా అని కొత్త కొత్త వంటలు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మన పూర్వీకులు ఎక్కువగా తీసుకున్న ఆహారమే అది. కాకపోతే ఈ తరం వాటి వాడకం తగ్గించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి వాటిని మన మెనూలో భాగం చేసుకోవడం చాలా అవసరం. ఆ వంటల విశేషాలు ఇవి...


ఈ నీటి ఆవకాయ పచ్చడిని తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా తింటారు. ఇది మామూలుగా నూనె పోసి తయారుచేసే ఆవకాయ కన్నా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆవకాయ పచ్చడి వేడి చేయదు. వర్షాకాలంలో ప్రతిరోజు తీసుకోవడానికి ఇది తగిన ఆహారం. ఇందులో ఉండే ఆవపిండి, పసుపు, ఇంగువ, కారం వర్షాకాలంలో వచ్చే కఫ సంబంధమైన రోగాలను తగ్గించడమే కాకుండా ఈ కాలంలో వచ్చే డయేరియాను కూడా తగ్గిస్తుంది.


కావలసినవి: మామిడి ముక్కలు - 7 భాగాలు, ఆవపిండి - 2 భాగాలు, కారం - ఒక భాగం, దొడ్డు ఉప్పు - రుచికి తగినంత, పసుప, ఇంగువ.


తయారీ విధానం: ఈ ఆవకాయను కలుపుకోవడానికి పింగాణి జాడి లేదా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పాత్రను ఉపయోగించాలి. జాడీలో ఉప్పు, ఆవపిండి, కారం, పసుపు, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో నీళ్లు పోసుకుంటూ దోసె పిండిలా జారుడుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమంలో మామిడికాయ ముక్కలు కలిపి తరువాత నువ్వుల నూనె లేదా వేరుశనగనూనె పలుచగా పోసుకోవాలి. ఈ ఆవకాయని మొదటి మూడు రోజులు రోజుకు రెండు సార్లు బాగా కలిపి పైన నూనె చిలకరించుకోవాలి. ప్రతిరోజు ఉప్పు సరిపోయిందో లేదో చెక్‌ చేసుకుంటూ అవసరమైతే కలుపుకోవాలి. మూడు రోజుల తరువాత జాడీలోకి గాలి చొరబడకుండా మూత బిగించి నిలువ చేసుకోవాలి. ఈ పచ్చడి సంవత్సరకాలం పాటు నిలువ ఉంటుంది.

Updated Date - 2021-06-12T22:10:26+05:30 IST