కొత్తిమీర చట్నీ

ABN , First Publish Date - 2021-10-23T18:11:14+05:30 IST

కొత్తిమీర - ఒక కట్ట (60గ్రా), పచ్చిమిర్చి - మూడు, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - రెండు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, కొబ్బరి తురుము - మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత.

కొత్తిమీర చట్నీ

కావలసినవి: కొత్తిమీర - ఒక కట్ట (60గ్రా), పచ్చిమిర్చి - మూడు, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - రెండు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, కొబ్బరి తురుము - మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత.


తయారీ విధానం: కొత్తిమీరను శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లో తీసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొబ్బరి తురుము, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి మెత్తగా పట్టుకోవాలి. రుచికి తగిన విధంగా నిమ్మరసం, ఉప్పు కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి పట్టుకుంటే మంచిది. ఈ చట్నీ పరోటా లేదా దోశలోకి రుచిగా ఉంటుంది.

Read more