మమ అనిపించారు
ABN , First Publish Date - 2021-12-31T19:36:53+05:30 IST
ల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను మమ అనిపించారు. అధికారులు నివేదికలు చదివి వినిపించడం మినహా ఎలాంటి చర్చ లేకుండానే ముగించారు.

నివేదికలకే పరిమితమైన జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
హనుమకొండటౌన్, డిసెంబరు 30: జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను మమ అనిపించారు. అధికారులు నివేదికలు చదివి వినిపించడం మినహా ఎలాంటి చర్చ లేకుండానే ముగించారు. గురువారం హనుమకొండలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో హనుమకొండ జిల్లా జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. ఎప్పటిలాగే అధికారులు వారి శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల నివేదికలను చదివి వినిపించారు. ఈ నివేదికలపై జడ్పీటీసీలు ఎలాంటి చర్చ పెట్టకపోవడం గమనార్హం. కేవలం మైన్స్ శాఖపై ప్రత్యేక సమావేవం నిర్వహించాలని జడ్పీటీసీల డిమాండ్ మేరకు చైర్మన్ సుధీర్‌కుమార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మిగతా శాఖలపై సమీక్షను మమ అనిపించారు. జడ్పీటీసీలంతా అధికార పార్టీ వారు కావడంతో లోపాలను ఎత్తిచూపకుండా వినడానికే పరిమితం అవుతుండటం విశేషం. ఈ సమావేశంలో చైర్మన్ సుధీర్‌కుమార్, సీఈవో వెంకటేశ్వర్‌రావు, జడ్పీటీసీలు శ్రీరాములు, రవి, శ్రీలత, సునీత తదితరులు పాల్గొన్నారు.