జర పైలం.. ఇది కరోనా కాలం

ABN , First Publish Date - 2021-05-18T08:14:10+05:30 IST

కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు.

జర పైలం.. ఇది కరోనా కాలం

కొవిడ్‌పై అవగాహన కల్పిస్తున్న పోలీసు శాఖ 

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి) : కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. 45 ఏళ్లు పైబడ్డ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు. పట్టణాలు, పల్లెలు మొదలుకుని మారుమూల గూడేల వరకు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్‌ తీవ్రత, దాని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పాటలు, కథల రూపంలో వివరించి చెబుతున్నారు. ఇందుకోసం పట్టణాల్లోని రద్దీ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఉన్న వాహనాలను ఉపయోగిస్తున్నారు. పల్లెలు, గూడేల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్‌ కళా బృందాలను రంగంలోకి దింపారు. ప్రతి రోజూ ఆయా జిల్లాల ఎస్పీల పరిధిలో కళా బృందాల వారు ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కరోనా బారి నుంచి కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెబుతున్నారు. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మాస్క్‌ ధరించాలని సూచిస్తున్నారు.

Updated Date - 2021-05-18T08:14:10+05:30 IST