జహీరాబాద్ కాంగ్రెస్ కంచుకోట: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-09-03T00:28:32+05:30 IST

జహీరాబాద్ కాంగ్రెస్ కంచుకోట అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జహీరాబాద్‌లో

జహీరాబాద్ కాంగ్రెస్ కంచుకోట: జగ్గారెడ్డి

సంగారెడ్డి: జహీరాబాద్ కాంగ్రెస్ కంచుకోట అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జహీరాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్‌, ఎంఐఎం, బీజేపీ, వైఎస్‌ఆర్‌టీపీలు అన్నీ ఒక్కటేనని విమర్శించారు. ఈ పార్టీల నేతలు పగలు కొట్టుకుంటారు.. రాత్రి అయితే కలిసి కూర్చుంటారని ఎద్దేవాచేశారు. పెట్రో, గ్యాస్ ధరలు పెంచినందుకా బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నది? అని ప్రశ్నించారు. దమ్ముంటే ప్రధాని మోదీతో మాట్లాడి పెట్రోల్‌ ధరలను తగ్గించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.


Updated Date - 2021-09-03T00:28:32+05:30 IST