యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి
ABN , First Publish Date - 2021-09-03T08:19:01+05:30 IST
జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా యువత కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ఉండాలని వైఎ్‌సఆర్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.

ఉద్యోగాలు ఇవ్వకుండా సర్కారు తాత్సారం: షర్మిల
హైదరాబాద్/కడప, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా యువత కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ఉండాలని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా టీఆర్‌ఎస్ సర్కారు తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని, గురువారం వైఎ్‌సఆర్‌టీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లోట్‌సపాండ్‌లో జాబ్ మేళా నిర్వహించారు. పార్టీ అధినాయకురాలు షర్మిల ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని యువతకు సూచించారు. నిరుద్యోగుల పక్షాన వైఎ్‌సఆర్‌టీపీ నిరంతరం పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ మేళాలో 30కంపెనీలు పాల్గొనగా.. 250 మంది ఉద్యోగాలు పొందినట్టు పార్టీ కార్యాల యవర్గాలు వెల్లడించాయి. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న మహబూబాబాద్‌కు చెందిన బోడ సునీల్ నాయక్ తమ్ముడు శ్రీనివా్‌సకు ఈ జాబ్ మేళాలో ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రం అందజేశారు.