మా నాన్నకు పులివెందుల ఎలాగో... నాకు పాలేరు అలా : వైఎస్ షర్మిళ

ABN , First Publish Date - 2021-03-24T19:57:59+05:30 IST

వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. దివంగత సీఎం వైఎస్సార్‌కు

మా నాన్నకు పులివెందుల ఎలాగో... నాకు పాలేరు అలా : వైఎస్ షర్మిళ

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. దివంగత సీఎం వైఎస్సార్‌కు పులివెందుల ఎలాగో, తనకు పాలేరు అలా అని ఆమె పేర్కొన్నారు. వైఎస్ షర్మిల బుధవారం ఖమ్మం జిల్లా నేతలతో  లోటస్‌పాండ్‌లో సమావేశమయ్యారు. మరోవైపు షర్మిల పార్టీ ప్రకటనకు సంబంధించిన బహిరంగ సభకు ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ సభకు పోలీసులు అనుమతినిస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 9న ఖమ్మంలో షర్మిల సభ నిర్వహించనున్నారు. ఈ లోగా ప్రభుత్వం కరోనా దృష్ట్యా ఏవైనా ఆంక్షలు విధిస్తే? ఎలా అన్న కోణంలో నేతలు ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉండగా, సభ నిర్వహణ నేపథ్యంలో మైదానానికి అవసరమైన అనుమతి వచ్చినప్పటికీ, పోలీస్ శాఖ నుంచి మాత్రం ఇంకా అనుమతి రాలేదు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, తాము మాత్రం సభ నిర్వహించి తీరుతామని, తమను ఎవరూ ఆపలేరని షర్మిళ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-03-24T19:57:59+05:30 IST