వైఎస్ మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్టే: షర్మిల

ABN , First Publish Date - 2021-07-08T23:45:45+05:30 IST

వైఎస్ మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్టే: షర్మిల

వైఎస్ మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్టే: షర్మిల

హైదరాబాద్: రాజశేఖర్‌రెడ్డి మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్టేనని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని ఆవిష్కరించిన ఆమె సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి  సేవలను కొనియాడారు. శత్రువులతోనూ ప్రశంసలు పొందిన నేత రాజశేఖర్ రెడ్డి అని ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్ జయంతి సందర్భంగా తెలంగాణలో పార్టీ పెట్టామని తెలిపారు. వైఎస్ ఆశయాల కోసం పోరాడతానని షర్మిల పేర్కొన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ, వివిధ విధానాలు, అజెండాలో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయని చెప్పారు. సంక్షేమం, స్వయంసంవృద్ధి, సమానత్వం వంటి అంశాలే ముఖ్య అజెండా అని షర్మిల చెప్పారు. Updated Date - 2021-07-08T23:45:45+05:30 IST