చున్నీతో ఉరి వేసుకుంటూ మిస్ తెలంగాణ విజేత Live Video..

ABN , First Publish Date - 2021-10-29T08:43:50+05:30 IST

చున్నీతో ఉరి వేసుకుంటూ మిస్ తెలంగాణ విజేత Live Video..

చున్నీతో ఉరి వేసుకుంటూ మిస్ తెలంగాణ విజేత Live Video..

  • స్నేహితుల సమాచారంతో కాపాడిన పోలీసులు 


హిమాయత్‌నగర్‌, అక్టోబరు28(ఆంధ్రజ్యోతి): లైవ్‌లో ఆత్మహత్యకు యత్నించిన యువతిని పోలీసులు కాపాడారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కలక హాసిని (27).. 2018లో మిస్‌ తెలంగాణ అందాల పోటీల్లో విజేతగా నిలిచారు. నిరుడు లాక్‌డౌన్‌ నుంచి వినోద రంగం దెబ్బతినడంతో హాసినికి మోడలింగ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. అటు యూట్యూబ్‌ వీడియోల ద్వారా కూడా పెద్దగా ఆదాయం రాలేదు. 


దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం మధ్యాహ్నం ఆత్మహత్యకు యత్నిస్తూ స్నేహితులతో లైవ్‌ వీడియోలో మాట్లాడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. క్షణాల్లో హిమాయత్‌సాగర్‌లోని ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు.. యువతిని రక్షించి హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. Updated Date - 2021-10-29T08:43:50+05:30 IST