తెలంగాణ అటవీ అకాడెమీలోఇంటర్నేషనల్ యోగా డే

ABN , First Publish Date - 2021-06-21T20:45:44+05:30 IST

తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడెమీ దూలపల్లి లో 7వ ఇంటర్నేషనల్ యోగా డేను ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ అటవీ అకాడెమీలోఇంటర్నేషనల్ యోగా డే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడెమీ దూలపల్లి లో 7వ ఇంటర్నేషనల్ యోగా డేను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ప్రధాన అటవీ సంరక్షణాధికారి (హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్) ఆర్.శోభ, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడెమీడైరెక్టర్ పివి రాజారావు, అడిషనల్ డైరెక్టర్ రమేశ్,  అకాడెమీ ఉపసంచాలకులు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, అకాడెమీ స్టాఫ్ (సిబ్బంది), ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శిక్షణార్థులు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శిక్షణార్థులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శిక్షణార్థులు తదితరులు హాజరయ్యారు.  ఓం ప్రకాశ్ యోగా గురువు ఆద్వర్యంలో యోగా చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంధి పాల్గొనడం జరిగినది. ఈసందర్భంగా కార్యక్రమంలో పాల్గన్న పలువురు అధికారులు, యోగా గురువు తదితరులు యోగా ప్రాధాన్యత గురించి మాట్లాడారు. ప్రతి రోజూ యోగా సాధన వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. భారత దేశంలో పుట్టినయోగ విద్య ఇప్పడు ప్రపంచానికి ఆచరణయోగ్యంగా మారిందన్నారు. 

Updated Date - 2021-06-21T20:45:44+05:30 IST