రెండు లక్షల పుస్తకాలు చదివా అంటున్న పవన్...
ABN , First Publish Date - 2021-10-28T20:37:20+05:30 IST
రెండు లక్షల పుస్తకాలు చదివాను అంటున్న పవన్ కళ్యాణ్...

కర్నూలు: రెండు లక్షల పుస్తకాలు చదివానని చెప్పిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ వెన్నుపూస గోపాల్ రెడ్డి స్పందించారు. పవన్ ఆ పుస్తకాలతో పాటుగా.... తాకట్టులో భారతదేశం, మనసులో మాట అనే పుస్తకాలను కూడా చదవాలని గోపాల్ రెడ్డి సూచించారు. కాగా, వామపక్ష పార్టీల నాయకులు నారాయణ, రామకృష్ణ, మధు పేదల పక్షాన పని చేయడం లేదని, పెత్తందారుల పక్షాన పని చేస్తున్నారని గోపాల్ రెడ్డి విమర్శించారు. వైసీపీ పాలనలో చంద్రబాబు తప్ప, ప్రజ లెవరూ ఇబ్బందులు పడటం లేదన్నారు.