యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ముందు స్థానికుల ఆందోళన

ABN , First Publish Date - 2021-02-05T16:30:02+05:30 IST

నల్లగొండ: దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ముందు స్థానికుల ఆందోళన

నల్లగొండ: దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. నిన్న టిప్పర్ ఢీకొని మృతి చెందిన బొమ్మనబోయిన రాజు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.


Updated Date - 2021-02-05T16:30:02+05:30 IST