యాదాద్రీశుడి సేవలు ఇక ప్రియం

ABN , First Publish Date - 2021-12-10T01:50:29+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి సేవా (ఆర్జిత) టిక్కెట్లు ప్రియం కానున్నాయి. స్వామివారి నిత్య కైంకర్యాలు

యాదాద్రీశుడి సేవలు ఇక ప్రియం

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి సేవా (ఆర్జిత) టిక్కెట్లు ప్రియం కానున్నాయి. స్వామివారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజల టిక్కెట్ల ధరలను 50 శాతానికి పైగా పెంచుతూ ఆలయ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన ధరలు ఈ నెల 10వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించే భక్తులు మొక్కు, శాశ్వత కైంకర్యాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. పెరుగుతున్న ధరలు, ఉద్యోగులు జీతభత్యాలు, ఆలయ అభివృద్ధికి భక్తుల నుంచి వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఆలయ ఖజానాకు లోటు ఏర్పడకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు. యాదాద్రి దేవస్థానంతో పాటు, కొండపైన రామలింగేశ్వరుడి, పాతగుట్ట ఆలయంలో భక్తుల నిర్వహించుకునే సేవోత్సవాల రుసుములు, నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజలు, నివేదనలు, భక్తులకు విక్రయించే ప్రసాదాల ధరలు పెంచారు.

Updated Date - 2021-12-10T01:50:29+05:30 IST