జిగేల్‌ వెలుగుల్లో యాదాద్రి క్షేత్రం

ABN , First Publish Date - 2021-11-11T01:06:52+05:30 IST

ప్రపంచ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో

జిగేల్‌ వెలుగుల్లో యాదాద్రి క్షేత్రం

యాదాద్రి: ప్రపంచ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యుద్దీకరణ పనులు కొనసాగుతున్నాయి. సుమారు రూ.9కోట్లతో విద్యుద్దీపాలను అమర్చే పనులు వైటీడీఏ ఆధ్వర్యంలో నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ప్రధానాలయంలో, ఆలయ అష్టభుజి ప్రాకారాలు, సప్తరాజగోపురాలకు విద్యుద్దీపాలను అమర్చిన అధికారులు పలుమార్లు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. స్వయంభువులు కొలువుదీరిన ప్రధానాలయ ముఖమండపంలో ఆధ్యాత్మికతను చాటిచెప్పేలా గంట ఆకృతి దీపాలు, ప్రాకార మండపాల్లో కమలపు దీపాలను అమర్చుతున్నారు. సుమారు 428 రకాల విద్యుద్దీపాలతో ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను శోభాయమానంగా తీర్చిదిద్దే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. కృష్ణరాతి శిలలకు దీటుగా విద్యుద్దీపాలంకరణ పనులను చేపడుతున్నట్లు, ఆధ్యాత్మికతకు ఆలవాలంగా ఉండే విధంగా రూపొందిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానాలయం, అష్టభుజిప్రాకార మండపాలు, సప్తరాజగోపురాలకు విద్యుద్దీపాలను అమర్చిన అధికారులు పలుమార్లు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. 


Updated Date - 2021-11-11T01:06:52+05:30 IST