యాదాద్రీశుడికి ఘనంగా నిత్యపూజలు

ABN , First Publish Date - 2021-10-07T12:23:53+05:30 IST

యాదాద్రీశుడికి నిత్య పూజలు బుధవారం ఘనంగా నిర్వ హించారు. మహాలయ అమావాస్య తిథికావడంతో యాదాద్రీశుడి దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో ఆలయ తిరువీధులు, సేవా మండపాలు భక్తుల సంద

యాదాద్రీశుడికి ఘనంగా నిత్యపూజలు

యాదాద్రి భువనగిరి: యాదాద్రీశుడికి నిత్య పూజలు బుధవారం ఘనంగా నిర్వ హించారు. మహాలయ అమావాస్య తిథికావడంతో యాదాద్రీశుడి దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో ఆలయ తిరువీధులు, సేవా మండపాలు భక్తుల సంద డి లేక వెలవెలబోయాయి. వేకువజామున సుప్రభాతంతో ఆరంభమైన నిత్యారాధనలు రాత్రి వేళ శయనోత్సవపర్వాలతో ముగిశాయి. ప్రధానాలయంలోని స్వయంభులను, బాలాలయ కవచమూర్తులను ఆరాధించిన ఆచార్యులు ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకిం చి అర్చించారు. అనంతరం హోమం, నిత్య తిరుకల్యాణ వేడుకలు ఆగమశాస్త్రరీతిలో కొనసాగాయి. కొండపైన రామలింగేశ్వరస్వామి, చరమూర్తులకు నిత్యపూజలు శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. స్వామికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా బుధవారం రూ.2,51,339 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.  అదేవిధంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిక్షేత్రంలో ఎంగిలి పూల బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. 

Updated Date - 2021-10-07T12:23:53+05:30 IST