ఉమ్మడి జిల్లా స్థాయి రెజ్లింగ్‌ క్రీడలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-27T05:20:20+05:30 IST

ఉమ్మడి జిల్లా స్థాయి రెజ్లింగ్‌ క్రీడలు ప్రారంభం

ఉమ్మడి జిల్లా స్థాయి రెజ్లింగ్‌ క్రీడలు ప్రారంభం
రెజ్లింగ్‌ పోటీలను ప్రారంభిస్తున్న రాజ్‌కుమార్‌

దుగ్గొండి, నవంబరు 26 : అండర్‌-15 బాలబాలికల కోసం ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి రెజ్లింగ్‌ పోటీలను వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలకేంద్రంలో శుక్రవారం రెజ్లింగ్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు శానబోయిన రాజ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి యాదగిరి సుధాకర్‌, ఎస్సై వంగాల నవీన్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా శానబోయిన రాజ్‌కుమార్‌ మాట్లాడు తూ.. దుగ్గొండిలో రెజ్లింగ్‌లో శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారని తెలిపారు. క్రీడలతో స్నేహభావం, క్రమశిక్షణ పెంపొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో  రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ తోకల నర్సిం హారెడ్డి, రెజ్లింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కోశాధికారి కందికొండ రాజు, కోచ్‌లు దేవేందర్‌, మహేశ్‌, కోడెం రాజలింగం, పీఈటీలు భిక్షపతి, వెన్నెల, బాలకృష్ణ, ప్రమోద్‌, బండారి మధు, జమాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T05:20:20+05:30 IST