మున్సిపల్ కమిషనర్‌కు పురుగుల చికెన్ బిర్యానీ

ABN , First Publish Date - 2021-08-04T01:26:48+05:30 IST

జిల్లా కేంద్రంలోని లక్ష్మీ రెస్టారెంట్లో పురుగులు పట్టిన చికెన్ బిర్యానీని వినియోగదారులకు

మున్సిపల్ కమిషనర్‌కు పురుగుల చికెన్ బిర్యానీ

నిర్మల్: జిల్లా కేంద్రంలోని లక్ష్మీ రెస్టారెంట్లో పురుగులు పట్టిన చికెన్ బిర్యానీని వినియోగదారులకు వడ్డించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. లక్ష్మీ రెస్టారెంట్లోకి లంచ్ చేయడానికి మున్సిపల్ కమిషనర్, సిబ్బంది వెళ్లారు. అయితే మున్సిపల్ కమిషనర్‌కు, సిబ్బందికి పురుగులు పట్టిన చికెన్ బిర్యానీని హోటల్ సబ్బంది వడ్డించారు. బిర్యానీలో పురుగులు కనిపించడంతో రెస్టారెంట్‌ను కమిషనర్ తనిఖీ చేసారు. తనిఖీలో కుళ్ళి పోయిన మాంసం నిల్వలు లభ్యమయ్యాయి. దీంతో హోటల్‌ను అధికారులు సీజ్ చేశారు. 

Updated Date - 2021-08-04T01:26:48+05:30 IST