బట్టలు ఉతికేందుకు వెళ్లి మహిళల గల్లంతు

ABN , First Publish Date - 2021-12-30T17:19:53+05:30 IST

బట్టలు ఉతికేందుకు వెళ్లి ఇద్దరు మహిళలు గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

బట్టలు ఉతికేందుకు వెళ్లి మహిళల గల్లంతు

మెదక్: బట్టలు ఉతికేందుకు వెళ్లి ఇద్దరు మహిళలు గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం నీలకంటిపల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతికేందుకు చెరువులో వెళ్లి బసమ్మ, దుర్గమ్మ అనే ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. నేడు బసమ్మ మృతదేహం లభ్యమైంది. దుర్గమ్మ కోసం స్థానికులు గాలిస్తున్నారు. 

Updated Date - 2021-12-30T17:19:53+05:30 IST