‘కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెస్తా..’

ABN , First Publish Date - 2021-08-20T17:48:32+05:30 IST

నియోజకవర్గంలో..

‘కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెస్తా..’

వర్ధన్నపేట: నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తెస్తానని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు అన్నారు. ఇల్లంద శివారులో లక్ష్మీగార్డెన్‌లో గురువారం కొత్తపెల్లికి చెందిన మాజీ జడ్పీటీసీ కమ్మగోని ప్రభాకర్‌, దమ్మన్నపేటకు చెందిన మాజీ సర్పంచ్‌ జన్నపురెడ్డి మనోహర్‌రెడ్డిల ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌, టీడీపీ నుంచి  వంద మంది కాంగ్రె్‌సలో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జక్కి శ్రీకాంత్‌, నాయకులు అబ్బిడి లక్ష్మారెడ్డి, చిదురాల కుమారస్వామి, సమ్మయ్య, రవీందర్‌రెడ్డి, అక్బర్‌, రవీందర్‌, కుమారస్వామి, బాలకృష్ణ, యాదగిరి పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-20T17:48:32+05:30 IST