జీడీపీ అంటే ఏమిటి?

ABN , First Publish Date - 2021-02-28T07:48:43+05:30 IST

‘వాటీజ్‌ ద ఫుల్‌ ఫాం ఆఫ్‌ జీడీపీ?’ అంటూ రాష్ట్ర ఐటీ, మునిసిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం ట్విటర్‌ ద్వారా కేంద్రంపై వ్యంగ్యాస్త్రం సంధించారు.

జీడీపీ అంటే ఏమిటి?

పెట్రోల్‌, డీజీల్‌, గ్యాస్‌ ధరల పెంపుపై కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘వాటీజ్‌ ద ఫుల్‌ ఫాం ఆఫ్‌ జీడీపీ?’ అంటూ రాష్ట్ర ఐటీ, మునిసిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి  కేటీఆర్‌ శనివారం ట్విటర్‌  ద్వారా కేంద్రంపై  వ్యంగ్యాస్త్రం సంధించారు. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ఽధరలను పెంచడంలో కేంద్రం అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తోందని ధ్వజమెత్తారు. జీడీపీ(గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) అంటే స్థూల జాతీయోత్పత్తి. అయితే  కేటీఆర్‌ ప్రశ్నకు అత్యధిక మంది నెటిజన్లు గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌(జీడీపీ) అని సమాధానమిచ్చారు. 

Updated Date - 2021-02-28T07:48:43+05:30 IST