ఏ స్కూలుకు ఏమేం కావాలి?

ABN , First Publish Date - 2021-03-22T07:28:03+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 4వేల కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఈ నిధుల వ్యయానికి సర్వే చేపట్టింది.

ఏ స్కూలుకు ఏమేం కావాలి?

పాఠశాలల్లో సర్వే షురూ.. హెచ్‌ఎంలకు ప్రశ్నావళి

హైదరాబాద్‌, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 4వేల కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఈ నిధుల వ్యయానికి సర్వే చేపట్టింది. పాఠశాలల్లో బాలికలు, బాలలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ప్రహరీగోడ, ఫర్నిచర్‌, విద్యుత్తు సౌకర్యం, కంప్యూటర్‌ సైన్స్‌ ల్యాబ్‌లు, గ్రంథాలయం, ప్రొజెక్టర్‌, ఇంటర్‌నెట్‌, కిచెన్‌ షెడ్‌ తదితర 53 అంశాలపై ప్రశ్నావళి రూపొందించారు. దీనిని శనివారం ప్రధానోపాధ్యాయులకు పంపించారు. ఈ వివరాలను సోమవారంలోగా అందించాలని పాఠశాల విద్యాశాఖ కోరింది. 

Updated Date - 2021-03-22T07:28:03+05:30 IST