పభుత్వ వైఫల్యాలపై నిలదీస్తాం: రఘునందన్‌

ABN , First Publish Date - 2021-03-14T08:00:15+05:30 IST

‘‘రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో నిలదీస్తాం. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతాం. స్పందించకపోయి నా, మాట్లాడేందుకు మాకు అవకాశం కల్పించకపోయినా అసెం బ్లీ బయట కూడా ఆ అంశాలపై ఉద్యమిస్తాం’’ అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

పభుత్వ వైఫల్యాలపై నిలదీస్తాం: రఘునందన్‌

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో నిలదీస్తాం. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతాం. స్పందించకపోయి నా, మాట్లాడేందుకు మాకు అవకాశం కల్పించకపోయినా అసెం బ్లీ బయట కూడా ఆ అంశాలపై ఉద్యమిస్తాం’’ అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. పీఆర్‌సీతో సహా అనేక అంశాలను బడ్జెట్‌ సమావేశాలలో ప్రస్తావిస్తామన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ శనివారం తమ ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్‌లతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం రాజాసింగ్‌తో కలిపి రఘునందన్‌మీడియాతో మాట్లాడారు.  ఐటీఐఆర్‌, రైల్వే కోచ్‌ తదితర అంశాలపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఏనాడైనా పార్లమెంట్‌లో అడిగారా? అని ప్రశ్నించారు. 

Updated Date - 2021-03-14T08:00:15+05:30 IST