హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం

ABN , First Publish Date - 2021-08-01T09:05:17+05:30 IST

సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేస్తామని మిడ్‌ మానేరు నిర్వాసితులు, ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం

ముంపు గ్రామాల ఐక్యవేదిక హెచ్చరిక


వేములవాడ టౌన్‌, జూలై 31: సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేస్తామని మిడ్‌ మానేరు నిర్వాసితులు, ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లి నంది కమాన్‌ చౌరస్తా వద్ద ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులు నల్లబెలూన్లను ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో 12 ముంపు గ్రామాల నుంచి గ్రామానికి 10 మంది నిర్వాసితులు చొప్పున ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. ఎన్నికలు అయ్యేంత వరకూ హుజూరాబాద్‌లోనే ఉండి నిర్వాసితులకు టీఆర్‌ఎస్‌ చేసిన అన్యాయాన్ని వివరిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-08-01T09:05:17+05:30 IST