నంది మేడారం పంప్ హౌస్ నుంచి నీటి విడుదల
ABN , First Publish Date - 2021-01-21T15:45:57+05:30 IST
కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. దీని నుంచి ఈ ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో నిర్మించిన
పెద్దపల్లి: కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. దీని నుంచి ఈ ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో నిర్మించిన నంది మేడారం పంప్ హౌస్ లోకి నిరంతరాయంగా నీటిని ఎత్తిపోస్తున్నారు. పంప్ హౌస్ లోని మూడు మోటర్ల ద్వారా లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్‌కు 9,450 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఇక్కడి నుంచి నీటిని మిడ్ మానేర్ రిజర్వాయర్ కు నీటిని తరలించే అవకాశం ఉంది. ఎండాకాలంలో కాళేశ్వరం కింద అన్ని చెరువులు, కుంటలు నింపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.