ఎన్నికల కోడ్‌ ఎత్తివేయడంతో ఓరుగల్లు నేతలకు కొత్త చిక్కులు..!

ABN , First Publish Date - 2021-12-07T18:05:53+05:30 IST

ఎన్నికల కోడ్‌ ఎత్తివేయడం అధికార పార్టీ నేతలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. వీధుల్లో ఏకగ్రీవ సంబరాలు చేసుకుందామనుకున్న గులాబీదళం.. ఇళ్ల నుంచి అడుగుబయట పెట్టకుండా టెన్షన్‌ టెన్షన్‌గా చూడాల్సి వస్తోంది. ఊర్లలో ఏం జరుగుతుందో

ఎన్నికల కోడ్‌ ఎత్తివేయడంతో ఓరుగల్లు నేతలకు కొత్త చిక్కులు..!

ఎన్నికల కోడ్‌ ఎత్తివేయడం అధికార పార్టీ నేతలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. వీధుల్లో ఏకగ్రీవ సంబరాలు చేసుకుందామనుకున్న గులాబీదళం.. ఇళ్ల నుంచి అడుగుబయట పెట్టకుండా టెన్షన్‌ టెన్షన్‌గా చూడాల్సి వస్తోంది. ఊర్లలో ఏం జరుగుతుందో తెలుసుకురమ్మని అనుచరులను పురమాయించాల్సివస్తోంది.ప్రతిపక్షాలు దూసుకుపోతున్నాయని కేడర్‌ చెబుతున్న మాటలు విని అధికారపార్టీ లీడర్లు హడలిపోతున్నారు. ఇంతకీ అధికారపార్టీ లీడర్లు ఇళ్ల నుంచి ఎందుకు బయటకు రాలేకపోతున్నారు. జనంలో ఎందుకు కలియతిరగలేకపోతున్నారు. మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


ఎన్నికల కోడ్‌ ఎత్తివేయడంతో ఓరుగల్లు నేతలకు కొత్త చిక్కులు

ఉమ్మడి వరంగల్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో కోడ్‌ ఎత్తివేయాల్సివచ్చింది. హుజురాబాద్‌ ఉప ఎన్నిక కోసం ఓరుగల్లు జిల్లా నేతలంతా అక్కడే మకాం వేసి తిరిగివచ్చాక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలొచ్చాయి. జనం సమస్యలు చెప్పుకునేందుకు వస్తే ఇప్పుడేం చేయరాదు కోడ్‌ ఉందని చెప్పి పంపించి తప్పించుకునేవారు లీడర్లు. ఆ తర్వాత స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌-ఎంసీసీ వచ్చింది. ఎవరైనా అత్యవసర పనులకోసం వచ్చినా అధికారపార్టీ నేతలు మేమేం చెప్పరాదని జనాలను తిప్పిపంపించేవారు. అయితే లోకల్‌ కోటా ఎమ్మెల్సీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవం కావడంతో కోడ్‌ ఎత్తివేశారు అధికారులు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలను దారిమళ్లించే అవకాశం లేకపోవడంతో లీడర్లు నెత్తిపట్టుకోవాల్సివస్తోందనే టాక్‌ వస్తోంది.


ఎన్నికల నెపంతో ప్రజా సమస్యలు మరిచిన గులాబీ నేతలు!

వివిధ ఎన్నికల నెపంతో దాదాపు మూడు నెలల నుంచి ఓరుగల్లు జిల్లా నేతలెవరూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవనే టాక్‌ ఉంది. వడ్ల కొనుగోలు కేంద్రాలు లేక.. అకాల వర్షాలతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. తడిసిన ధాన్యం సమస్య.. లారీల కొరత.. తూకం మోసాలలాంటి రైతు సమస్యల పరిష్కారం కోసం టిఆర్ఎస్ నేతలు పెద్దగా చొరవ చూపలేదనే ఆరోపణలున్నాయి. నేతల దగ్గరకే  రైతులు వచ్చి వరి కొనుగోలు కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేసినా ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్‌ను సాకుగా చూపించి తప్పించుకున్నారు అధికారపార్టీ నాయకులు. 


రైతు సమస్యల ఎఫెక్ట్‌ వచ్చే ఎన్నికలపై ఉంటుందనే భయంలో టీఆర్‌ఎస్‌! 

రైతుల పక్షాన ఎవరైనా విపక్ష పార్టీల నేతలు ఆందోళన చేయడానికి సిద్ధపడితే ఎన్నిక కోడ్ ఉంది అంటూ పోలీసులు ఇన్నాళ్లూ అనుమతి ఇవ్వలేదు. రైతు కల్లాల దగ్గరకు వెళ్లి వారికి మద్దతుగా కార్యక్రమం చేస్తామంటే కూడా అరెస్టులు చేయాల్సివస్తుందని పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో విపక్షాలు సైతం నామ మాత్రంగా  కార్యక్రమాలు చేశాయి. విపక్ష నేతలు సైతం రైతుల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేకపోవడం ఇన్నాళ్లూ అధికార పార్టీ నేతలకు కలిసొచ్చింది. కానీ తాజాగా ఎన్నికల కోడ్ ఎత్తివేసిన నేపథ్యంలో విపక్షాలు రైతుల సమస్యలపైన ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విపక్షాలు స్పీడందుకోవడం అధికార పక్షం నేతలను టెన్షన్‌కి గురి చేస్తోంది. రైతుల మసస్సు గెలుచుకోలేకపోతే వచ్చే ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుంది అని కొందరు ఎమ్మెల్యేలు హడలిపోతున్నారని వాళ్ల దగ్గరి మనుషులు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. 


రైతుల దగ్గరకు నేరుగా వెళ్లేందుకు సాహసించని ఎమ్మెల్యేలు!

చాలా రోజులుగా ఇబ్బందులు పడుతూ ఆగ్రహావేశాలతో ఉన్నరైతుల దగ్గరకు ఒక్కసారిగా వెళ్లడం సాధ్యం కాదని భయపడుతున్నారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. మొదట స్థానిక నేతలను  రైతుల దగ్గరకు పంపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానిక నేతలను రైతులతో మాట్లాడించి వారి అవసరాలు తెలుసుకున్నాక వాటి పరిష్కారం చూపేందుకు వెళుతునట్లుగా   వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారనే టాక్‌ వస్తోంది.కేంద్రాల్లో కొనుగోళ్లు వేగవంతం చేసేలాగా అధికారుల మీద ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఒత్తిడి చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 


ఆందోళనలు తప్పించుకునేందుకు ఛలో హైదరాబాద్‌ అంటున్న నేతలు 

ప్రతిపక్ష పార్టీ నేతలు రైతుల దగ్గరకు వెళ్లక ముందే  స్థానిక నేతలతో, రైతులతో మాట్లాడి అన్నదాతలకు తక్షణం కావాల్సిన సహయం పైనా అరా తీసున్నారు అధికారపార్టీ నేతలు. కనీసం ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన అవసరాలను తీర్చే లాగా అధికారులపై ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయినా ఆనుకున్న స్థాయిలో వర్కవుట్‌ కాకపోవడంతో అధికార పార్టీ నేతలను కలవరనికి గురిచేస్తోంది. నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్న  రైతు కష్టాలను పట్టించుకోలేదనే విమర్శల నుంచి ఎలా బయటపడాలనే టెన్షన్ టీఆర్‌ఎస్‌ నేతల్లో రోజురోజుకి పెరిగిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సమస్యల నుంచి తప్పించుకునేందుకు నేతలు హైదారాబాద్‌ టూర్లు పెట్టుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. 


ఎమ్మెల్సీ ఏకగ్రీవాన్ని ఎంజాయ్‌ చేయలేకపోతున్న ఓరుగల్లు నేతలు 

సమస్య నుంచి బయటపడేందుకు మరికొన్నాళ్లు ఎన్నికల కోడ్‌ ఉంటే బాగుండేదనే భావనలో అధికారపార్టీ నేతలున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం చేసినందుకు హైకమాండ్ దగ్గర మెప్పు పొందేందుకు అవకాశం లేకుండా పోయిందనే ఆందోళన ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోందనే ఇన్‌సైడ్‌ టాక్‌ వస్తోంది. 

Updated Date - 2021-12-07T18:05:53+05:30 IST