దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
ABN , First Publish Date - 2021-01-21T04:18:53+05:30 IST
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

వరంగల్ టౌన్, జనవరి 20 : కష్టపడి పండించిన పత్తికి ఎక్కువ ధర ఇస్తామని నమ్మబలికే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం అన్నారు. బుధవారం మార్కెట్లో చైర్మన్ సదానందం సీసీఐ పర్చేసింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోతున్న విషయాన్ని సీసీఐ అధికారులు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన చైర్మన్ సదానందం ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన కొందరు దళారులు పత్తికి క్వింటాల్‌కు రూ.5800లు ఇస్తామని చెప్పి చివరకు రూ.5100, 5200లు ఇస్తూ పత్తి రైతులను మోసం చేస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దన్నారు. సీసీఐకి అమ్ముకుని క్వింటాల్‌కు రూ. 5615లు పొందాలని సూచించారు.